5, మే 2018, శనివారం

✳ దేవుని దృష్టికి ఘనమైన బంధం




వివాహము అన్నిటికంటే ఘనమైనదిగా ఉండవలెను....
( హెబ్రీ 13:4 )

ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.
దేవుడు వెలుగుకమ్మని పలుకగా వెలుగు కలిగెను అది మంచిదని దేవుడు చూచెను. . . .
ఆరిన నేలను భూమి అని, జలరాశిని సముద్రమని పిలచి అది మంచిదని దేవుడు చూచెను. . . .
నోటి మాటతోనే సకల వృక్షములను మొలిపించి అది మంచిదని దేవుడు చూచెను. . . .
ఆకాశవిశాలంలో సూర్యచంద్రులను రెండు జ్యోతులను చేసి అది మంచిదని దేవుడు చూచెను. . . .
సకల విధములైన జలరాశులను, ఆకాశపక్షులను చేసి అది మంచిదని దేవుడు చూచెను. . . .
ఈవిధముగా దేవుడు తను చేసిన ప్రతి పనిని పరీక్షించి చూసినప్పుడు అది చాలా చాలా మంచిగా ఉండుట దేవుడు చూసేను.
కానీ.... దేవుని నోటినుండి వచ్చిన మొట్టమొదటి నెగిటివ్ మాట ఒకటుంది.... దేవుడు చేసిన ప్రతి పని మంచిగా దేవుడు చూశారు కానీ ఒక్కటి మాత్రం సమస్యలా అనిపించింది, కొంచం లోటులా కనిపించింది. అందుకే ఒంటరిగా ఉన్న నరుడిని చూసి నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని పలికారు....(అది 2:18).
అందుకే నరునికి సాటియైన సహాయమును వానికొరకు దేవుడే స్వయంగా తనే సృజించారు. . . . వారిరువురు ఏకశరీరమై ఉండునట్లు వారి మధ్య బంధాన్ని స్థిరపరిచారు.

వివాహము అన్నిటికంటే ఘనమైనదిగా ఉండవలెను....( హెబ్రీ 13:4 )
అవును.... వివాహము ఘనమైనదిగా ఉండవలెను ఎందుకంటే అది దేవుని ఏర్పాటు కనుక. . . .

వివాహము ఘనమైనదిగా ఉండవలెను ఎందుకంటే మీరు ఫలించి, అభివృద్దిపొంది, విస్తరించుడి అనే దేవుని ఆశీర్వదాన్ని నెరవేర్చే పరిశుద్ధకార్యము కనుక. . . .

వివాహము ఘనమైనదిగా ఉండవలెను ఎందుకంటే క్రీస్తుకి సంఘానికి మధ్య సంబంధాన్ని వివరించవలసి వచ్చినప్పుడు ఈ వివాహబంధం తప్ప మరోమాట త్రాసులో తూగలేకపోయింది కనుక. . . .

అలాంటి.... ఈ వివాహబంధం నేడు అందం అనే ముసుగువేసుకుని, కట్నకానుకల కంచె వేసుకుని, అన్యఆచారాల మెరుగులు అడ్డుకుని అంతో అసహ్యంగా తయారయ్యింది.

నా ప్రియ స్నేహితులారా. . . .
మీరు ఇంకా వివాహం కానీ యవ్వనస్తులైతే.... ఈ మటలు మీకోసమే అని గమనించండి....
మీ వివాహబంధాన్ని అందంచందం, కట్నకానుకలపై కట్టుకోకుండా, ప్రేమఅనురాగం, ఆత్మీయ, ఆధ్యాత్మిక దృష్టికోణంలో కట్టుకోండి.... అది ఎంతో మేలు. . . .
అందం ఆస్తి ఉన్నవారు కాలం పరీక్షలో కరిగిపోతారు. కానీ మంచి మనస్సు ఉన్నవారు మరణించినా సరే ఒక మధుర జ్ఞాపకంగా మనతోనే మిగిలిపోతారు.

భార్యాభర్తలను క్రీస్తుకు సంఘానికి సాదృశ్యరూపాలుగా చూపటం ద్వారా దేవునివాక్యం ఈ వివాహబంధాన్ని ఎంతో సన్మానించి, గౌరవించింది. అవును, ముమ్మాటికి దేవుని దృష్టికి ఘనమైన బంధం. . . . ఈ వివాహబంధం.

అలా దేవుడు ఎంతో అమూల్యంగా భావించిన ఈ వివాహబంధం కట్నమనే ఆచారంతో, విడాకుల చట్టాలతో తన విశిష్ట ప్రముక్యతను కోల్పోతూ ఉంది. అందులో భాగంగా ప్రేమలను, విలువలను పక్కనబెట్టి “డబ్బే” ప్రధాన ఎజండాగా జరిగిన పెళ్లిల్లు చాలానే మూడునాళ్ళముచ్చటగానే మిగులుతున్నాయి.... విడాకులకు దారితీస్తున్నాయి.

కట్నం గురించి మాట్లాడుతూ ఒక భక్తుడు ఇలా అన్నరు “ కట్నం తీసుకునే పురుషుడు, డబ్బు తీసుకుని వ్యేభిచారం చేసే వాడు ఒక్కటే” అని. అవును.... "Dowry Is Nothing  But A Male Prostitution"

ఈ మాట మీలో కొందరికి నచ్చదు, నామీద కోపం కూడా రావొచ్చు. కానీ మీకు తియ్యని మాటలు చెప్పటానికి కాదు నేను ఇక్కడ ఉంది. మీరు కొట్టే ఒక Like కోసం మీరు వ్రాసే Comment కోసం మీకు అనుకూలంగా వాక్య ప్రమాణాలను నేను మార్చలేనుకదా.

కట్నాన్ని పాపంగా చూసే యవ్వనబిడ్డల కోసం నా దేవుడు ఎదురుచూస్తున్నారు కానీ; పెళ్లి పేరుతో కూడా వ్యాపారం చేసే పొట్టులాంటి వారికోసం కాదు.

Bible లో ఒక్క దేవుని బిడ్డ కూడా కట్నం తీసుకున్నట్లు మనకి కనిపించరు, మనం బాగా చూస్తే ప్రియమైన భార్య కోసం ఎదురిచ్చిన వారు, తమను తాము ప్రాణార్పణంగా బలి చేసుకున్న వారు మాత్రమే మనకి కనిపిస్తరు.

తన భార్య కోసం ఆదాము తన ప్రక్కటేముకను ఇచ్చారు.
తన భార్య కోసం ఇస్సాకు తన ధనాగారంలోనే విలువైన ఆభరణాలు ఇచ్చారు.
తన భార్య కోసం యాకోబు 14 సం!!రాలు భానిసగా కొలువు చేసారు.
చివరికి.... వధువు సంఘం కోసం నా యేసయ్య తన అమూల్యమైన రక్తాన్నే చిందించారు.

ఇవ్వగలిగితే తన కుటుంభాన్ని విడిచివచ్చే ఆ బంగారు తల్లికి ఎదురుగా భాహుమానాలు ఇవ్వు.... లేదంటే కష్టమందును సుఖమందును, లేమియందును కలిమియందును, వ్యాధియందును బాధయందును నిన్ను విడువను అని ఆ దేవాధిదేవుడైన యెహోవా ముందు ప్రమాణం చేసి తన చెయ్యిపట్టుకుని నీ ఇంటికి తిసుకోచ్చుకోండి. అప్పుడు ఎంతో మందికి ఆదర్శంగా, వెలుగులాగా నువ్వు నిలబడతావు.

నా ప్రియ స్నేహితులారా.... జాగ్రత్తగా గమనించండి.
అపవాధిని వణికించే భక్తులు కూడా ఈ వివాహం విషయంలో, తన బిడ్డల వివాహ విషయంలో పడిపోతూ ఉంటారు. సమర్ధించుకోటానికి తమకు అనుకూలమైన వాక్య భాగాలను వెతుకుంటూ ఉంటారు.
తెలిసి తెలియని కాలంలో అమాయకంగా కట్నం తీసుకున్నవాళ్ళని దేవుడు క్షమిస్తరు కానీ.... ఇప్పుడు అన్ని తెలిసి గుడ్డిగా ముందుకు వెళ్ళేవాళ్ళని దేవుడు క్షమిస్తారోలేదో అనుమానమే అండి.

దేవుడు ఎంతో శ్రద్ధగా రూపునిచ్చిన ఈ వివాహబంధాన్ని మన దురాశలతో, మన ఆలోచనలతో కలుషితం చేయకూడదు.
మనకి మెరుగైన సమాజాన్ని అందించటంలో మన పెద్దలు కొద్దిగా ఓడిపోయారు, కానీ మన తరువాత తరానికి మనం మరింత మంచి సమాజాన్ని ఇవ్వాలి, అలా ఇవ్వాలి అంటే చాలా విషయాలకి మనమే... ఇప్పుడే... ఇక్కడే... ముగింపు పలకాలి.
కట్నం తీసుకోరాదు అని నా మట్టుకు నేను ఎప్పుడో ఒక తీర్మానం తీసుకున్నాను.
మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి....

మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువులవారి నామంలో చేయబడిన ఈ ప్రకటన ప్రకారముగాను మిమ్మును వాక్యంలో స్థిరపరచుటకు మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.
ఆమేన్‌. ఆమేన్. ఆమేన్.


Tqs very much

WHICH IS RULE - ఏది ధర్మం

 ఏది ధర్మం :

♻ ప్రియ పాఠకులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామము పేరట శుభాభివందనాలు తెలియజేస్తున్నాము...*

గత దినము నేను ధర్మము అనే అంశం గురించి కొన్ని ప్రశ్నలు వేయటం జరిగింది ఏది చేయుట ధర్మము ఏది చేయుట అధర్మము అని ఇలా అడగడానికి గల కారణము ఏమిటి అంటే.

ప్రతి రోజు ఉదయాన్నే కొందరు అన్య సోదరులు నాకు సందేశాలు పంపే వారు వారు పంప్పే ప్రతి అంశంలోను మన ధర్మాన్ని రక్షించుకోవాలి అన్న మాటను లెక్కలేనన్ని సార్లు చదివాను వారు కూడా నాతో చెప్పేవారు నువ్వు క్రైస్తవ్యం అనే మత్తులో ఉన్నవు...  

మేలుకో మేలుకో ఇంకా ఎంత కాలం ఆ మబ్బులోనే ఉంటావు అని నాకు తెలిసిన తెలియని కొత్త చరిత్ర చెప్పే వాళ్ళు...

నేను వారిని సూటిగా ప్రశ్నించాను మీరు నిజమైన ధర్మాన్ని నాకు చూపిస్తే నేను నమ్మిన క్రీస్తు ధర్మాన్ని విడిచిపెట్టి మీ వెంట వస్తాను అని చెప్పాను...

నేను అడిగిన ఏ ప్రశ్నకు కూడా వారి చరిత్ర ప్రకారం సమాధానం చెప్పలేకపోయారు కారణం ధర్మ గ్రంథలుగా చెప్పేబడే వాటిలో ధర్మం లేకపోవడం వల్ల...  

1) మనలను రక్షించే ధర్మం ధర్మమా లేక మనము రక్షించుకునే ధర్మం ధర్మమా అని ఆడిగాను..

జ) అన్య సోదరులు మనలను రక్షించే ధర్మమే ధర్మము అన్నారు...
మరి మీరు రాసే ప్రతి సందేశంలోను పలు అంశాల్లోనూ మన ధర్మాన్ని రక్షించుకోవాలి అని పెద్ద పెద్ద నినాదాలు చేస్తున్నారు కదా అని చెప్పా...
మనము నమ్మిన ప్రభువైన యేసుక్రీస్తు వారు సింహాసనాన్ని విడిచి సిలువకు ఎక్కారు ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కోసం ధారపోశారు ఆయన్ని మనము రక్షించుకోలేదు ఆయనే మనలను రక్షించడానికి వచ్చాడు ఇది నిజమైన మనలను రక్షించే ధర్మం.

2) మేలుచేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా! అని అడిగాను.

జ) అన్య సోదరులు మేలు చేయడం ధర్మం ప్రాణరక్షణ ధర్మం అని చెప్పారు...

అయితే ఓకేదేశంలో వుంటూ ఒక్కే భూమి మీద పండించిన పంటను తింటూ మాకు ఒకరమైన చట్టం మీకు ఒక రకమైన చట్టం మాకు ఒకరమైన తీర్పు మీకు ఒకరమైన తీర్పు అది మీ ధర్మ గ్రంధాల ఆధారంగానే చట్టం మీకు చూట్టంగా మాకు శత్రువుగా ఉంది ఇక మేలు అన్నది ఏనాడో భూస్థాపితం చేశారు అని చెప్ప.... మౌనం...

2) ప్రాణరక్షణ ధర్మమా లేక ప్రాణహత్య ధర్మమా.?

జ) అన్య సోదరులు ప్రాణరక్షణే ధర్మం ప్రాణహత్య అధర్మం అని చెప్పారు...

అయితే మీరు ప్రాచీన కాలం నుండి దండయాత్రలు చేసి అనేకుల రక్తమును ఒలికించారు అది మీ ధర్మస్థాపన కోసం మీ ధర్మనుసారముగా మీ ధర్మాన్ని కాపాడుకోవడానికి  రక్తాన్ని ఒలికించడం మీ దృష్టికి సబాబుగానే ఉండింది...

అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ధర్మం చెప్పున తన పవిత్ర రక్తాన్ని మన కొరకు కార్చారు... 

2)జ) ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి సిలువలో మన కోసం బలిపశువుగా మారాడు కానీ తన కోసం మనలను బలిగా బలిపశువుగా చేయలేదు...


క్రీస్తు ధర్మం:- A.

మత్తయి 5: 44
నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మును హింసించు వారికొరకు ప్రార్థన చేయుడి.


2)జ) క్రీస్తు ధర్మం:-

1పేతురు 3: 9
ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి.

క్రీస్తు ధర్మం:-

లూకా 6: 29
నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంపకూడ త్రిప్పుము. నీ పైబట్ట ఎత్తికొని పోవువానిని, నీ అంగీని కూడ ఎత్తికొనిపోకుండ అడ్డగింపకుము.
మరి వారి ధర్మం ఇలా చెప్పిందా లేనే లేదు.

3) దేవుడు మనలను రక్షించుట ధర్మమా లేక మనము దేవుణ్ణి రక్షించుకొనుట ధర్మమా.?

జ) అన్య సోదరులు దేవుడే మనలను రక్షించుట ధర్మం అని చెప్పారు.
అయితే కొంత కాలం క్రితం మీరు ఒక దైవ క్షేత్రంలో ఒక నినాదాన్ని ప్రభుత్వం ద్వారా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు అది మన ధర్మ పరిరక్షణ మన దేవుని రక్షణ మన విశ్వాసాలను మన విధానాలను కాపాడుకోవాలని అన్న నినాదాన్ని రేపి ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో దేవుణ్ణి కాపాడుకోవడం మొదలు పెట్టారు దేశంలో ఎన్నడూ లేని విధంగా అందులో భాగంగానే ద్రోహ విద్రోహ చర్యలకు వారు నాంది పలికారు ఉదా:- PA స్వామి గారి మీద దాడి..

3)జ) నా దేవుని ధర్మం:-A

యెషయా 45: 21
మీ ప్రమాణవాక్యములు నా సన్నిధిని తెలియ జేయుడి జనులు కూడుకొని ఆలోచన చేసికొందురు గాక; పూర్వకాలము మొదలుకొని ఆ కార్యమును తెలియ జేసినవాడెవడు?చాలకాలముక్రిందట దాని ప్రకటించినవాడెవడు?యెహోవానగు నేనే గదా? నేను తప్ప వేరొక దేవుడు లేడు.నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు.

4)ధర్మాసనంలో ఉన్న న్యాయదేవత కళ్ళకు గంతలు కట్టి ఉండటం ధర్మమా లేక అధర్మమా.?

జ) అన్య సోదరులు న్యాయస్థానంలో ఉన్న దేవత కళ్ళకు గంతలు కట్టి ఉండటం ధర్మమే కారణం ఒక వ్యక్తికి కళ్ళు లేకపోవడంతో భార్యగా తాను కూడా అంధురాలిగా ఉండటానికి ఇష్టపడింది అని చెప్పారు...

అయితే చట్టం ముందు అందరూ సమానులు చట్టం ఎవరి చుట్టం కాదు అయినప్పుడు పక్షపాత ధోరణి ఉండకూడదు కదా ఆ వ్యక్తి భార్య తాను అంధురాలిగా ఉండటానికి తన కళ్ళకు గంతలు కట్టుకుంది అది రాజ్యము మీద ఉన్నదా అభిమానంతో కాదు తన భర్తపైన ఉన్న ప్రేమానుభూతితో ఇది పక్షపాత ధోరణి కాదా 


4)జ) నా దేవుని ధర్మం:-A

          సామెతలు 15: 3
యెహోవా కన్నులు ప్రతి స్థలముమీద నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును.

నా దేవుని ధర్మం ధర్మాసనం:-B

యెషయా 16: 5
కృపవలన సింహాసనము స్థాపింపబడును సత్యసంపన్నుడై దానిమీద కూర్చుండి తీర్పుతీర్చు నొకడు కలడు దావీదు గుడారములో అతడాసీనుడై న్యాయము విచారించుచు న్యాయము జరిగించుటకై తీవరించును.

4)జ) నా దేవుని ధర్మం ధర్మాసనం:C

జెఫన్యా 3: 5
​​అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యనున్నాడు; ఆయన అక్రమము చేయువాడు కాడు, అనుదినము తప్పకుండ ఆయన న్యాయ విధులను బయలుపరచును, ఆయనకు రహస్యమైనదేదియు లేదు; అయినను నీతిహీనులు సిగ్గెరుగరు.

కళ్ళు వున్నవాడు న్యాయం చేయగలడా లేక గ్రుడ్డివాడు న్యాయం చేయగలడా చిత్రిమైన కధాంశం..మౌనం.

5) విందు జరుగుచున్న యింటికి పోవుట ధర్మమా లేక  ప్రలాపించుచున్నవారి యింటికి పోవుట ధర్మమా.?

జ) అన్య సోదరులు ప్రళపించుచున్న వారి ఇంటికే పోవుట ధర్మము.

అయితే వీరి ధర్మంలో ఉన్నత వర్గానికి చెందిన ఒక తెగ లేక ఒక గుంపు జనాలు తమ వారు ఎవరైనా జబ్బున పడి మరణానికి దగ్గరగా ఉంటే అనగా మరి కొద్దిసేపట్లో చనిపోతారు ఆనంగా ఆ వ్యక్తిని తీసుకొని ఇంటి బయట పెడతారు కారణం ఆ ఇంట్లో వ్యక్తి మరణించడం అశుభం అని కీడు అని అలాగే ఆ ఇంటిలో ఎవ్వరు ప్రలాపించరు అంటే ఎవరు ఏడ్వారు కారణం అలా నట్టింట్లో ఏడిస్తే అశుభం అని కీడు అని.

5)జ) నా దేవుని ధర్మం:- A.

ప్రసంగి 7: 2
విందు జరుగుచున్న యింటికి పోవుటకంటె ప్రలాపించుచున్నవారి యింటికి పోవుట మేలు; ఏలయనగా మరణము అందరికినివచ్చును గనుక బ్రదుకువారు దానిని మనస్సున పెట్టుదురు.

నా దేవుని ధర్మం:- B

ప్రసంగి 7: 3
నవ్వుటకంటె దుఃఖపడుట మేలు; ఏలయనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును.
   
5)జ) నా దేవుని ధర్మం:- C.

ప్రసంగి 7: 4
జ్ఞానుల మనస్సు ప్రలాపించువారి యింటిమీదనుండును; అయితే బుద్ధి హీనుల తలంపు సంతోషించువారి మధ్యనుండును.

నా దేవుని ధర్మం:- D

రోమీయులకు 12: 16
ఏడ్చువారితో ఏడువుడి; ఒకనితో నొకడు మనస్సుకలిసి యుండుడి. హెచ్చు వాటియందు మనస్సుంచక తగ్గువాటియందు ఆసక్తులై యుండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు.

ప్రియ పాఠకులారా! మనలను రక్షించే ధర్మం ధర్మమని మనము రక్షించుకునేది ధర్మం కాదు అని, మేలు చేయుట ధర్మమని కీడు చేయుట అధర్మమని, ప్రాణరక్షణ ధర్మమని ప్రాణహత్య అధర్మమని, మనలను రక్షించే దేవుడు ధర్మమని మనము రక్షించుకునే దేవుడు అధర్మమని, న్యాయం చెప్పే వారి కన్నులకు గంతలు ఉండటం అధర్మమని కళ్ళు ఉన్న వారు న్యాయం చెప్పుట ధర్మమని ఈ న్యాయ దేవత పేరు కానీ ఆమె భర్త పేరు కానీ వాక్యం ఉన్న చోటు రాయకూడదు అన్న భావనతో ధర్మాన్ని జోడించి పేరు మార్చాను అతని గురించి ఒక రచయిత అభివర్ణించిన పేరును అక్కడ పొందుపరచడం జరిగింది, విందు జరుగు చోటికి పోవడం అధర్మమని ప్రలాపించుచున్న ఇంటికి పోవటం ధర్మమని...

విశ్లేషణాత్మకంగా నిజమైన ధర్మానికి అబద్ధమైన ధర్మానికి ఆధారపూర్వకంగా ఉన్న వ్యత్యాసాన్ని తెలియజేసాము,

మనలను మోసే దేవుడే దేవుడు అని మనము మోసే దేవుడు దేవుడు కాదు అని,

మనలను కాపాడేదే విశ్వాసం అని మనము కాపాడేది విశ్వాసం కాదు అని,

మనలను రక్షించేదే ధర్మం అని మనము రక్షించుకునేది ధర్మం కాదు అని,...

మేము ప్రకటిస్తున్నా క్రీస్తు సజీవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా వున్నవాడు మారని వాడు మార్పు చెందని వాడు...

కామ క్రోధ మొహా మద మాశ్చర్యలు లేని వాడు నాలో పాపము ఉన్నదని మీరు నిరూపించగలరా అని ప్రపంచానికి సవాలు విసిరినవాడు,

వేశ్యను సహితం అమ్మ అని పిలిచిన వాడు,

కుష్ఠురోగులను ముట్టి బాగుచేసిన వాడు...

అన్ని విన్న అన్య సోదరులు ఆఖరిగా నాతో చెప్పిన మాట ఏమిటి అంటే ఇంకో పదినిమిషాలు నీతో మాట్లాడితే మేము కూడా క్రైస్తవులుగా మారిపోయి మీ వెంట తిరిగే పరిస్థితి వస్తుంది ఇక మాకు నీకు ఎటువంటి సంబంధం లేదు నీ ధర్మం గురించి నువ్వు ప్రకటించుకో మా ధర్మం గురించి మేము ప్రకటించుకుంటాం మీరు మా జోలికి రావద్దు మేము మీ జోలికి రాము అని దణ్ణం పెట్టి వెళ్లిపోయారు...
క్రైస్తవ్యం అనే గ్రుడ్డుతనంలో ఆ మబ్బులో జీవిస్తున్నావు బయటకు రా అన్న నన్ను నువ్వు నీ మార్గములోనే ఉండు నీ పద్ధతులను నువ్వు పాటించుకో అని చెప్పి వెళ్లిపోయారు...
మనలో ఉన్న జ్ఞానాన్ని బట్టి కాదు వాక్యాన్నికి ఉన్న బలాన్ని బట్టి వారు వెళ్లిపోయారు.

వల వేసాము చేపలు పడినట్టే పడి తప్పించుకున్నాయి ఏరోజుకైనా వస్తాయి అన్న చిన్న ఆశ...

1కోరింథీయులకు 1: 18
సిలువను గూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱి తనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.

మార్కు 16: 15
మరియుమీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి.

అట్టి కృప ధన్యత!!
దేవుడు మనకు అనుగ్రహించును గాక ఆమెన్!!
•••••••••••••••••••••••••••••••••••••

IDLE WORSHIP - విగ్రహారాధన

.....విగ్రహారాధన.......
     (మొదటి భాగము)

*విగ్రహారాధన దేవునికి అత్యంత అసహ్యమైన చర్య.

*విగ్రహారాధన అంటే? 
విగ్రహాలను తయారు చేసుకొని, వాటికి కొబ్బరికాయలు కొట్టి, అరటి పళ్ళు పెట్టి, అగరబత్తీలు వెలిగించి వాటిని దేవునిగా పూజించడం. 

అదేనా? 
నీవు చెప్తావ్. నేను అట్లా చెయ్యడంలేదు. నేను ఎట్టి పరిస్థితులలోనూ విగ్రహారాధికుడను కాదని. 

కాని, ఒక్క విషయం!
విగ్రహారాధన అంటే అది మాత్రమే కాదు. 
•దేవుని కంటే ఎక్కువగా దేనికి నీవు ప్రాధాన్యత ఇస్తున్నావో? అదే నీ జీవితంలో ఒక 'విగ్రహం'. 
•నీ హృదయం దేనితో నిండి పోయిందో? అదే నీ జీవితంలో ఒక 'విగ్రహం'. 

*దేనికి ప్రాధాన్యత నిస్తున్నావ్? 
నీ హృదయం దేనితో నిండిపోయింది? 
•గాళ్ ఫ్రెండా? 
•బాయ్ ఫ్రెండా? 
•మోటార్ బైక్సా? 
•వస్త్రాలా?
•సెల్ ఫోన్సా?
•బంగారమా? 
•ధనమా? 
•ఆస్థులా? 
•అంతస్తులా? 
•నీ పిల్లలా? 
•అసూయా? 
•ద్వేషమా? ఏది? 
ఇవన్నీ విగ్రహాలే. 

ఇప్పుడు చెప్పగలవా? 
నేను విగ్రహారాధికుడను కాదని. 

ఇట్లా టన్నుల కొద్దీ చెత్త మన హృదయంలో పేరుకుపోయినప్పుడు ఇక దేవునికి స్థానం ఎక్కడ? 

ఏదో కాస్త ఖాళీ ఉంచినా? ఆ చెత్త మధ్య పరిశుద్దుడైన దేవుడు నివాసం చెయ్యగలడా? 

అందుకే కదా! 
సంవత్సరాలు నీ జీవితంలో దొర్లిపోతున్నా?
ఆయన నీ హృదయమనే తలుపునొద్ద(బయట) మాత్రమే నిలబడిపోవలసి వస్తుంది. 

నేడే ఆ విగ్రహాలను తొలగించి నీ ప్రియ రక్షకుని లోనికి ఆహ్వానించగలవా? 

*లేకపోతే ఏమవుతుందో తెలుసా? 

'విగ్రహారాధకులు' అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.
             ప్రకటన 21:8

వద్దు! 
ఇది వినడానికే భయంకరం. 

సరి చేసుకుందాం. 
సాగిపోదాం. 
గమ్యం చేరేవరకు. 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్!    ఆమెన్!    ఆమెన్!

3, మే 2018, గురువారం

SIN

SIN గురించి వార్త....1st part


*ఆజ్ఞాతిక్రమమే పాపము.*
        1యోహాను 3:4  
     .........................

పాపము అంటే?
దేవుడు చెయ్యమన్నది చెయ్యకపోవడం.
చెయ్యవద్దన్నది చెయ్యడం.

దేవుని మాటను, ఆయన చట్టాన్ని అతిక్రమించడమే 'పాపము'.

దేవుడు చేయ్యమన్నదేదో?
చెయ్యవద్దన్నదేదో?
మనకెట్లా తెలుస్తుంది?

పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించడం ద్వారా మాత్రమే తెలుస్తుంది.

అయితే,
పాపములో నిలిచియున్నవాడు పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించలేడు.
పరిశుద్ధ గ్రంధాన్ని ధ్యానించేవాడు పాపములో నిలచియుండలేడు.

దేవుడు మానవుని సృష్టించినప్పుడు 'దేవుడు ఎంతటి పరిశుద్ధుడో?' మానవుని కూడా అంతే పరిశుద్ధునిగా సృష్టించాడు.

కాని, చెయ్యవద్దని చెప్పినపని చెయ్యడం ద్వారా పాపమును భూమిమీదకు  తీసుకొచ్చారు.

ఆ పాపమే వారికి శాపాన్ని తెచ్చి పెట్టింది.ఆ శాపాన్నే వారి పిల్లలమైన మనందరికీ పంచిపెట్టారు.

పాపము పరిపక్వమై మరణాన్ని కన్నదితప్ప, మానవుని సృష్టించినప్పుడు కొంతకాలం జీవించిన తర్వాత మరణించాలనే నిబంధన ఏది దేవుడు పెట్టలేదు.

మానవుని సృష్టించిన దేవుడే, తన ప్రియకుమారుడైన యేసు ప్రభువును భూమి మీదకు పంపించి, సిలువమరణం ద్వారా, ఆయన రక్తాన్ని విమోచనా క్రయదనము చెల్లించి, నిత్యమరణం నుండి మనలను విడిపించి ఆయన కుమారులుగా చేసుకున్నాడు.

మనను తిరిగి పాపంలోనికి ప్రవేశించకుండా నియంత్రించడానికి దేవుడు మనకోసం సిద్ధపరచినవే 'ఆజ్ఞలు' లేదా 'చట్టం'.

ఆయన చట్టాన్ని అతిక్రమించి మరలా పాపములోనే కొనసాగితే?
పాపములోనే నిలిచియుంటే?
ఆ రెండవ మరణం నుండి తప్పించేవారెవ్వరూలేరు.

వద్దు!
ఆయన చిత్తానికి తలవంచుదాం!
ఆయన బాటలో సాగిపోదాం!
ఆ గమ్యం చేరేవరకు!

అట్టి కృప, ధన్యత
దేవుడు మనకు అనుగ్రహించునుగాక!

ఆమెన్! ఆమెన్! ఆమెన్

20, డిసెంబర్ 2016, మంగళవారం

Real christmas parts 1-4

CRISTMAS

*క్రిస్మస్* ( మొదటి భాగము)

 దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. లూకా 2:11
 ...........................
 *క్రిస్మస్ అంటే?*
 • దేవుని ప్రేమ లోకానికి ప్రత్యక్షం కావడం. • దేవుని మహిమ శరీరధారిగా లోకానికి దిగిరావడం. • సంతోష, సమాధాన, రక్షణ సువార్తమానం క్రిస్మస్ అంటే? క్రీస్తును ఆరాధించడం. క్రైస్ట్ అంటే క్రీస్తు మాస్ అంటే ఆరాధన కాని నేటి, "క్రైస్ట్ మాస్ లో క్రైస్ట్ మిస్" అయిపోతున్నాడు. కారణం? నేటి క్రిస్మస్!! "ఇంటి పైన స్టార్ ఇంట్లో బార్" లా మారిపోయింది. నేటి క్రిస్మస్ 1. ఇంటి క్రిస్మస్: ఇంటి శుభ్రం 2. ఒంటి క్రిస్మస్ క్రొత్త బట్టలు 3. పంటి క్రిస్మస్ వండుకొని తినడం వీటికే పరిమితం. క్రీస్తుఆరాధనా కాస్త క్రిస్మస్ సెలబ్రేషన్స్ లా మారిపోయాయి. సెమి క్రిస్మస్ లు, మెగా క్రిస్మస్ లు, గ్రాండ్ క్రిస్మస్ లు అంటూ ... ఏవోవో పేర్లు. ఎన్ని పేర్లు పెట్టినా, ఆ క్రిస్మస్ లో క్రీస్తుకు స్థానం వుందా? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. వాటిలో వేసే డాన్సులు రికార్డింగ్ డాన్స్ కి ఎంతమాత్రం తీసిపోవు. అదేంటి అంటే? దావీదు నాట్యం చెయ్యలేదా? అంటూ క్లారిఫికేషన్. దావీదు నాట్యం చేసిన సందర్భం వేరు. నాట్యం చేసినా? ఆయన ఒక గ్రూపు తయారుచేసి స్టెప్పులు నేర్చుకొని నాట్యం చెయ్యలేదు. క్రిస్మస్ ఎందుకింత వికృత రూపం దాల్చుతుంది? కారణం ఒక్కటే? ఆయన జన్మించి రెండువేల సంవత్సరాలు దాటిపోయినా? నేటికీ మన హృదయాల్లో జన్మించక పోవడమే. ఒకరేమో క్రిస్మస్ చెయ్యకూడదంటారు. మరొకరేమో చేసి తీరాలంటారు. కొందరేమో ఫరో, హేరోదు మాత్రమే పుట్టిన రోజులు జరుపుకున్నారు అని వాదిస్తుంటే? మరి కొందరేమో క్రిస్మస్ అంటే, అసలు క్రీస్తు పుట్టిన రోజు కాదని, క్రీస్తు ఆరాధన అని, క్రిస్మస్ చెయ్యవద్దు అంటే? క్రీస్తుని ఆరాధించ వద్దని అర్ధం అంటారు. కాని ఒక్కటి మాత్రం గుర్తుంచుకో! దేవునికి దగ్గరయ్యే పని ఏదయినా చెయ్యి. దేవునికి దూరమయ్యే పని ఏదీచెయ్యొద్దు. క్రీస్తుని ఆరాధించాలంటే? *ఆరాధించే హృదయం నీకుంటే చాలు*. మరేది అవసర్లేదు. ఇంతకీ ఈ క్రిస్మస్ నిన్ను దేవునికి దగ్గర చేస్తుందా? దూరం చేస్తుందా? నీ జీవితంలో అనేక క్రిస్మస్ లు దొర్లిపోయాయేమో? కనీసం ఈసారి అయినా నిజమైన క్రిస్మస్ ను ఆరాధన చెయ్యగలవా? నేడే ప్రియరక్షకుని మన హృదయంలోనికి ఆహ్వానిద్దాం! క్రిస్మస్ తెచ్చే శాంతిని, సమాధానాన్ని అనుభవిద్దాం! ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్! క్రిస్మస్ శుభములు మీకు కలుగును గాక!

 *క్రిస్మస్* (రెండవ భాగము) దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. లూకా 2:11 ..........................
. క్రిస్మస్ అంటే? క్రీస్తు పేరుతో వ్యాపారమా? అట్లానేవుంది కదా? *ప్రపంచ చరిత్రలో ఎక్కువ వ్యాపారం జరిగేది క్రిస్మస్ దినాల్లోనేనట. *ఎక్కువ మద్యం అమ్ముడుపోయేది క్రిస్మస్ దినాల్లోనేనట. *క్లబ్ లు , ఫబ్ లు, రెస్టారెంట్లు రద్దీగా వుండేది క్రిస్మస్ దినాల్లోనేనట. క్రిస్మస్ పేరుతో క్రీస్తుని ఆరాధించడం మాని, క్రీస్తునే అమ్మేసు కొంటున్నాము. ఇస్కరియోతు యూదా క్రీస్తుని 30 వెండి నాణెములకు అమ్ముకున్నాడు గాని, మనమయితే మూడు రూపాయలకే అమ్మేసేవాళ్ళమేమో? *పేరుకు మాత్రమే క్రిస్మస్ ఆరాధించు కొనేది మాత్రం "మనకు మనమే". *మన టేలంట్ చూపించుకోవడానికి క్రిస్మస్ ను వేదికగా మలచుకొంటున్నాం. *క్రిస్మస్ ఆరాధనలో సినిమా పాటలకు సహితం డాన్స్ చేసే దుస్థితికి దిగజారిపోయాం. ఒక్కమాటలో చెప్పాలంటే? *క్రిస్మస్ లో, కనీసం క్రిస్మస్ ట్రీ కి, క్రిస్మస్ తాతకిచ్చిన ప్రాధాన్యత కూడా క్రీస్తుకు ఇవ్వలేక పోతున్నాం. *ఆరాధించాల్సిన దేవుని సంగతే మరచిపోతున్నాం. దీనికేనా మనం క్రిస్మస్ అని పేరు పెట్టుకున్నది? ఆరాధించే మనసులేకపోతే? ఆరాధించడం చేతకాకపోతే? చేతులు కట్టుకొని కూర్చోవడం శ్రేయస్కరం. అంతేగాని, క్రిస్మస్ పేరుతో ఆయన అద్భుతమైన త్యాగాన్ని లోకంలో నవ్వులుపాలు చేసే ప్రయత్నం చెయ్యొద్దు. అందుకే ఆయన అంటున్నాడు. మిమ్మును బట్టియే కదా నా నామం అన్య జనుల మధ్య దూషించ బడుచున్నది? అవును! మన ఆరాధన ఆయనను దూషణ పాలుచేసేదిగా కాకుండా, ఆయనకు మహిమ తెచ్చేదిగా వుండి, అనేక మంది అన్య జనులను రక్షణ లోనికి నడిపించేదిగా వుండాలి. ఇదెప్పుడు సాధ్యం? ఆయన నీ హృదయంలో జన్మించినప్పుడు మాత్రమే. లేకపొతే, నీవు చేసే ఆరాధన ఒక ఆచారమౌతుంది తప్ప, ఆయనకు మహిమను, నీ జీవితానికి ఆశీర్వాదాన్ని తీసుకొని రాలేదు. నీ హృదయం ఆయనకింకా దూరంగానుందా? నేడే ఆయనను చేర్చుకో! ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్! క్రిస్మస్ శుభములు మీకు కలుగును గాక!

 *క్రిస్మస్* (మూడవ భాగము) యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి మత్తయి 2:2 ........................... 
స్టార్ (నక్షత్రం):
(స్వయంగా ప్రకాశించేది) ఈలోకంలో చాలా స్టార్స్ వున్నాయ్. *సూపర్ స్టార్ *టెరా స్టార్ *మెగా స్టార్ *ఈ స్టార్స్ గా పిలువబడే వారిని వెంబడించేవారు లోకంలో కోకొల్లలు. *ఈ స్టార్స్ వెలుగులో ఉన్నవారిని చీకటిలోనికి తీసుకెళ్తారు తప్ప, చీకటిలోనున్న వారిని వెలుగు లోనికి నడిపించలేరు. అయితే, ప్రకాశ మానమైన నక్షత్రం ఒకటుంది. అది, *ప్రకాశించింది. *అత్యానందాన్నిచ్చింది *దారి చూపించింది. *గమ్యం చేర్చగలిగింది. యేసు అను నేను నా దూతను పంపి యున్నాను. నేను దావీదు వేరుచిగురును సంతానమును, ప్రకాశమానమైన వేకువచుక్కయునై యున్నాను. ప్రకటన 22:16 ఆ స్టార్ మన ప్రియ రక్షకుడైన యేసు ప్రభువు. * ఈ స్టార్ కున్న 5 కోణాలు, ప్రియ రక్షకుని 5 గుణగణాలను తెలియజేస్తున్నాయి. 1.ఆశ్చర్యకరుడు 2.ఆలోచనకర్త 3.బలవంతుడైన దేవుడు 4.నిత్యుడగు తండ్రి 5.సమాధానకర్త యెషయా 9:6 ఇంతకీ నీ గమ్యమేమిటి? ఏ స్టార్ ని వెంబడిస్తున్నావ్? * ఈ లోకంలో స్టార్స్ ని నీవు కలవాలంటే? నీకు ఎప్పటికీ అనుమతి దొరకక పోవచ్చు. కాని, ఈ స్టార్ నిన్ను కలసుకోడానికి దివి నుండి భువికి దిగి వచ్చింది. *ఈ లోకంలో స్టార్స్ నిన్ను నలిపేస్తారు. కాని, ఈ స్టార్ నీకోసం నలిగిపోయింది. దివి నుండి దిగి వచ్చిన స్టార్ ను వెంబడించ గలిగితే? *ఆశ్చర్య క్రియలు నీ జీవితంలో అనుభవిస్తావ్. *నీ ప్రతీ పరిస్థితిని పరిష్కరించుకోగల ఆలోచన దొరుకుతుంది. *నీ బలహీన సమయాల్లో ఆయనే నీ బలం. *నిత్యమూ నీకు తండ్రిగా ఉంటాడు. *నీ జీవితమంతా సమాధానమే. ఇదెప్పుడు సాధ్యం? *ఆయన నీ హృదయంలో జన్మించినప్పుడు మాత్రమే. *ఆ స్టార్ ను వెంబడించినప్పుడు మాత్రమే. *నీ హృదయం ఆయనకింకా దూరంగానుందా? నేడే ఆయనను చేర్చుకో! ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!

 క్రిస్మస్ శుభములు మీకు కలుగును గాక! ...........

 *క్రిస్మస్*......... (నాలుగవ భాగము)

 *క్రిస్మస్ తాత*: క్రిస్మస్ లో క్రీస్తు ఉన్నాడో లేదో తెలియదు గాని, క్రిస్మస్ లో క్రిస్మస్ తాత లేకపోతే అది క్రిస్మస్సే కాదు. *క్రిస్మస్ లో క్రిస్మస్ తాత క్రీస్తునే మించి పోయాడు.* క్రిస్మస్ ను చాలామంది x-mas(ఎక్స్ మాస్ ) అని పిలుస్తుంటారు. అది నిజమే అనిపిస్తుంది కూడా. లెక్కలు మాస్టారు "తెలియని దానిని" x (ఎక్స్ )అనుకోండి అని చెప్తారు. లెక్క చివర్లో ఆ "x" (ఎక్స్ )విలువ ఎంతో చెప్తారు. *x-mas*: "x"అంటే? తెలియబడనిది "mas"అంటే? ఆరాధన x-mas పేరుతో "తెలియని దానినే ఆరాధిస్తున్నాం." ఆ "x" (ఎక్స్ ) ఏంటో నేటికీ కనుగొనలేని పరిస్థితిలోనే ఉన్నాము. 4 వ శతాబ్ధంలో, టర్కీ దేశంలో నికోలస్(శాంతా క్లాజ్) అనే వ్యక్తి ఉండేవాడు. సంపన్న కుటుంబములో పుట్టి పెరిగి, చిన్నప్పుడే తలిదండ్రులు కోల్పోయాడు. ఇతడు చాలా జాలిగల హృదయం కలిగిన వాడు. ప్రజల అవసరాలు తెలుసుకొని రహస్యముగా వెళ్లి కొంత సొమ్ము వారింట్లో వేసి వస్తుండేవాడు. చిన్న పిల్లల విషయంలో కూడా అట్లా జరిగేది, పెద్ద వాళ్ళు చెప్పడంవల్ల డిసెంబర్ 24 రాత్రి క్రిస్మస్ తాత వచ్చి రహస్యంగా బహుమతులు ఇచ్చి వెళ్తాడని వాళ్ళు నమ్మేవారు. తర్వాత కాలంలో ఆయన సెయింట్ గా పిలువబడి, బిషప్ గా కూడా పని చేసినట్లు చరిత్ర చెబుతుంది. క్రిస్మస్ అంటే? బహుమతుల పండుగని, యేసు క్రీస్తు ఈ లోకానికి బహుమానంగా అనుగ్రహించ బడ్డాడని, క్రిస్మస్ సందర్భముగా ఒకరికొకరు బహుమతులిచ్చు కోవడం, గ్రీటింగ్స్ పంపుకోవడం చేస్తుంటారు. ఫేస్ బుక్, వాట్సాప్ వంటివి వచ్చాక వీటికి అంతేలేదు. నికోలస్(శాంతా క్లాజ్) కూడా ఇట్లా బహుమానాలు ఇచ్చేవాడని తీసుకొచ్చి క్రిస్మస్ లో అంతర్భాగం చేసేసారు. అది ఎంత వరకూ వచ్చిందంటే? పిల్లలకు క్రీస్తు అంటే తెలియక పోయినాగాని, క్రిస్మస్ తాత అంటే మాత్రం తెలియకుండా వుండదు. క్రిస్మస్ తాత వస్త్రాలు, అలంకరణ వస్తువుల పేరుతో కోట్ల బిజినెస్ జరుగుతుంది. క్రీస్తు జననానికి, క్రిస్మస్ తాతకు ఎక్కడైనా సంబంధం ఉందా అంటే? లేనే లేదు. *ఆచారాల ముసుగులోపడి, దేవుని ఆరాధించలేక పోతున్నాం.* దేవునికి చెందవలసిన మహిమ వేటికో అర్పిస్తున్నాం. ఇది "సృష్టికర్తను మరచి సృష్టిని పూజించడం" కాదంటారా? *దేవుని యొక్క స్థానాన్ని మరొకటి తీసేసుకుంటే? అది విగ్రహారాధన కాదంటారా?* పది నిమిషాల పిల్లల సంతోషం కోసం ఇట్లాంటి కార్యక్రమాలు ప్రోత్సహించే మనం నిజరక్షకుని ఎట్లా ఆరాధించాలో వారికి తెలియజేయగలిగితే? వారి జీవితమంతా సంతోషమే కదా! ఈ క్రిస్మస్ లో మనమెందుకు ప్రత్నించ కూడదు? ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్! క్రిస్మస్ శుభములు మీకు కలుగును గాక!